గుమ్మడిదల, మే23: డంపింగ్‌యార్డు నిర్మాణానికి వ్యతిరేకంగా శాంతియుతంగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డిని గృహనిర్బంధం చేయడం అప్రజాస్వామికమని రైతు సంఘం అధ్యక్షుడు అమ్మగారి సదానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కారుకు చిత్త శుద్ధి ఉంటే ముందు జహిరాబాద్‌లో నిర్వహించే సభలో ప్యారానగర్ డంపింగ్‌యార్డును రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం గుమ్మడిదలలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యానికి, పర్యావరణానికి విఘాతం కలిగించే డంపింగ్‌యార్డును రద్దు చేయాలని ఆందోళన చేయడం న్యాయముందన్నారు. ప్రజల మనభావాలను అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్యారానగర్ డంపింగ్‌యార్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో బీఆర్ఎస్ నాయకులు చిమ్ముల దేవేందర్‌రెడ్డి, సూర్యనారాయణ, ఆంజనేయులుయాదవ్, పొన్నాల శ్రీనివాస్‌రెడ్డి నడిమంటి ఆంజనేయులు, వెంకటేశ్‌యాదవ్ ఉన్నారు.