రూ.10 లక్షలతో 9వ వార్డులో డ్రైనేజీ పనులు ప్రారంభించిన
తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్‌గౌడ్
రామాయంపేట, ఆగస్టు 21: దళితవాడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేస్తున్నదని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్‌గౌడ్ అన్నారు. శనివారం తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 9వవార్డు రావెళ్లిలో రూ.10లక్షలతోడ్రైనేజీ పనులను, వైకుంఠధామ సుందరీకరణ పనులను ప్రారంభించారు.అనంతరం చైర్మన్ మాట్లాడుతూ తూప్రాన్ పట్టణ ప్రజల కోసం రూ.10కోట్ల 50 లక్షలతో ఇంటిగ్రేటెడ్ భవనం, రూ.5కోట్లతో మున్సిపల్‌కు పక్కా భవనం, రూ.2 కోట్ల 60లక్షలతో వైకుంఠధామాల నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. పట్టణప్రజల సహకారంతో తూప్రాన్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా త యారు చేయడమే లక్ష్యంమన్నారు. ప్రస్తుతం గతంలో ఉన్న వైకుంఠధామ పనుల కోసం రూ.8 లక్షలు మున్సిపల్ నుంచి కేటాయించమన్నారు. కార్యక్రమంలో 9వ వార్డుకౌన్సిలర్ రాజు, మున్సిపల్ సిబ్బంది ప్రవీణ్, నాగేశ్, వినోద్, అశోక్ తదితరులున్నారు.