జిన్నారం, ఆగస్టు 22 : ప్రభుత్వ భూములను ఎవరు అక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ జయ ప్రకాశ్‌నారాయణ హెచ్చరించారు. గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని ఖాజీపల్లి గ్రామంలోని 181 సర్వే నంబర్‌గల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు పునాదాలు తీశారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న ఆర్ఐ జయప్రకాశ్‌నారాయణ శుక్రవారం జేసీబీ వాహనాలతో పునాదులను పూడ్చివేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.