నేరడిగుంట: తొలకరితో మురిపించిన వానలు మళ్లీ ముఖం చాటేశాయి. కోటి ఆశలతో విత్తులు నాటిన రైతన్నలు వర్షాల కోసం ఆకాశంకేసి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆందోల్ మండలం నేరడిగుంట ప్రజలు వరుణుడు కరుణించాలని, సమృద్ధిగా వానలు కురవాలని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని మల్లన్న గుడిని నీళ్లతో నింపి పూజలు చేశారు. సమస్త జీవకోటి బతకాలంటే రైతన్న పండించిన పంటలే జీవనాధారం. అలాంటి పంటలు పండాలంటే వర్షాలే దిక్కు. వానలు సకాలంలో కురవకపోవడంతో రైతన్న ఆగమాగం అవుతున్నాడు. రైతులకు దేవుడే దిక్కు. అందుకే ఆ భగవంతుడిని నీళ్లతో నింపి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది.
ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ సోషల్ వర్కర్ శ్రీదర్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లన్న గుడి నింపి మడుపతి శ్రీకాంత్ స్వామితో కలిసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వారాది శరనప్ప, ముదిరాజ్ సంఘం నాయకులు సంగెం శంకరయ్య, కోదండ కృష్ణ, మంతురి భీరప్ప, నర్సమ్మ, మల్లేశం, చింటూ, సంగెం కృష్ణ, భాను, కోదండ శేఖర్, బుసరెడ్డిపల్లి మహేష్, ఒగ్గు చెన్నయ్య, బోయిని విష్ణు, పెద్దగొల్ల మల్లేశం, గొల్ల శంకర్, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.