Grama Panchayati labourers | నిజాంపేట్, సెప్టెంబర్ 18 : నిజాంపేట్ మండల పరిధిలోని నాగధర్ గ్రామ పంచాయతీ కార్మికురాలు బాలవ్వ కరెంట్ షాక్ తగలడంతో గాయపడింది. కరెంట్ షాక్‌తో తగిలిన గాయం తగ్గేవరకు బాలవ్వకు జీతం ఇవ్వాలని.. కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని సీఐటీయూ డివిజన్ ఏరియా కార్యదర్శి రమేష్ అన్నారు. గాయాలైన కార్మికురాలికి సీఐటీయూ నాయకులు రమేష్ సతీష్‌లు పరామర్శించి డీఎల్పీవో సీఐటీయూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించడం జరిగింది
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. దీంతో కార్మికురాలికి చెయ్యి లేపడానికి రావడం లేదు. కార్మికురాలికి కుటుంబం, పిల్లలు ఉండడంతో కుటుంబం ఎలా గడుస్తుందో అంటూ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కార్మికురాలు గాయం తగ్గేవరకు గ్రామపంచాయతీ నుండే జీతం ఇవ్వాలని అలాగే మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించాలని అన్నారు. ప్రభుత్వం చిన్న జీతం కాబట్టి వారికి గ్రామపంచాయతీ నుండి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని.. జీతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఈఎస్ఐ సౌకర్యం కల్పించే విధంగా జీవో తీసుకురావాలని అన్నారు.
ప్రమాద బీమా ఈఎస్ఐ సౌకర్యం ఉంటే వారి కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇలాంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా గ్రామ కార్యదర్శులు సలహాలు, సూచనలు అందివ్వాలని ప్రమాదాలు జరిగిన ఎంపీడీవో, ఎంపీవో అధికారులు కార్మికురాలిని పరామర్శించలేరని.. చనిపోతే కూడా అధికారులు పట్టించుకోరా..? అని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికులకు న్యాయం చేసే విధంగా ప్రమాద బీమా పథకం అమలు చేసేందుకు కృషి చేయాలని అన్నారు, సీఐటీయూ నాయకులు సతీష్, రవికుమార్ ఉన్నారు.