Fire Accidents | జహీరాబాద్, ఏప్రిల్ 15 : అగ్ని ప్రమాదాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జహీరాబాద్ అగ్నిమాపక కేంద్రం అధికారి శ్రీనివాస్ అన్నారు. జాతీయ అగ్ని మాపక వారోత్సవాల్లో భాగంగా ఇవాళ జహీరాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లో అగ్నిమాపక వారోత్సవాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు వేసవికాలంలోనే జరుగుతాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు 101, 102 నంబర్లను సంప్రదించాలన్నారు.
అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఆర్టీసీ బస్టాండ్, రైల్యే స్టేషన్లో ప్రయాణికులకు కరపత్రాలను పంపిణీ చేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్ని మాపక అధికారులు, సిబ్బంది సలీం, పవన్, రామకృష్ణ, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
BRS | బీఆర్ఎస్ రజతోత్సవ గులాబీ సేన రెడీ.. శ్రేణులకు ఎమ్మెల్యే మాణిక్రావు దిశానిర్దేశం
MLC Kavitha | బెదిరింపులకు పాల్పడేవారిని వదిలిపెట్టేదే లేదు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Rajapet : ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన బోధన : ఎంఈఓ చందా రమేశ్