MP Suresh Kumar Shetkar | ఝరాసంగం, ఏప్రిల్ 7: కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ అన్నారు. ఇవాళ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు వేదామంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మొదట ఆలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్గా చంద్రశేఖర్, 11 మంది కమిటీ సభ్యులతో దేవాదాయ సూపరింటెండెంట్ శివరాజ్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్, గ్రంథాయాల చైర్మన్ అంజయ్య , జిల్లా పరిషత్ మాజీ ఛైర్మెన్ సునీతా హన్మంతరావు పాటిల్ దంపతులు, యువజన జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్, మాజీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్ జహీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని శనివారం ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ స్థానిక నాయకులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలోని అమృత గుండంలో పాదాచారణ చేసి అనంతరం గర్భగుడిలోని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ కార్యనిర్వాహణ అధికారి శివరుద్రప్ప శాలువాతో సన్మానించి స్వామి వారి ప్రసాదం అందజేశారు. అనంతరం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ నూతన చైర్మన్గా ఎన్నికైన అప్నగరి చంద్రశేఖర్ పటేల్, 11 మంది కమిటీ సభ్యులను పూలమాల శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
వారి వెంట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశం, కేతకీ ఆలయ మాజీ చైర్మన్ నరసింహ గౌడ్, నాయకుడునమ రవికిరణ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.