హత్నూర,జూన్29 : హత్నూర మండలం సికింద్లాపూర్-నాగులదేవులపల్లి గ్రామాలకువెల్లే తారురోడ్డుపై మధ్యలోవున్న మూలమలుపు వద్ద రోడ్డుపూర్తిగా చెడిపోయి ప్రమాదకరంగా మారింది. మూలమలుపు వద్దకు వెళ్లేంత వరకు చెడిపోయిన తారురోడ్డు కనిపించకపోవడంతో అదుపుతప్పి కిందపడే పరిస్థితి నెలకొంది.
సింగిల్రోడ్డు కావడంతో తారురోడ్డు చెడిపోయి ఒకపక్క కాలువలా ఏర్పడటంతో గమనించకుండా వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి మూలమలుపు వద్ద సూచికబోర్డు ఏర్పాటు చేసి రోడ్డుకు మరమ్మతు పనులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.