Farmer ID registration | ఫార్మర్ ఐడీ నమోదును రైతులు సద్వినియోగం చేసుకోవాలి : లావణ్య
ఫార్మర్ ఐడీ నమోదును రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని జహీరాబాద్ మండల వ్యవసాయాధికారి లావణ్య సూచించారు.
జహీరాబాద్, మే 7 : ఫార్మర్ ఐడీ నమోదును రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని జహీరాబాద్ మండల వ్యవసాయాధికారి లావణ్య సూచించారు. బుధవారం మండలంలోని శేఖాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఫార్మర్ ఐడీ నమోదుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి రైతుకు 11 నంబర్లతో విశిష్ట సంఖ్య (యూనిక్‌కోడ్) ఫార్మర్ ఐడీని అందజేయనున్నామన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్‌లో ఏరకమైన చట్టబద్ధత యాజమాన్య హక్కును కల్పించబోదని, ఇది కేవలం రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాల ప్రామాణికంగా తీసుకుని రైతులకు ఫార్మర్ ఐడీని కేటాయించడం జరుగుతుందన్నారు.
అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఈ ఫార్మర్ ఐడీ అనుసంధానం చేయనున్నారు. పీఎం కిసాన్ లబ్ధిదారులకు తదుపరి విడత లబ్థి పొందుటకు ప్రామాణికంగా ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ఈమేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ చేపడుతున్నామన్నారు. రాష్ట్ర పథకాలకు ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్‌కు ఎటువంటి సంబంధం లేదన్నారు. దీని కోసం రైతులు అధార్ కార్డు, పట్టా పాసుబుక్కు, అధార్‌కు లింక్ చేసిన పోన్ నంబర్ తీసుకోని వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలన్నారు. ఈ నెల 31వ తెదిలోగా ప్రతి రైతుల ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ తప్పని సరిగా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

