గుమ్మడిదల,మార్చి31: ప్యారానగర్ డంపింగ్‌యార్డును రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపాలిటీ కేంద్రంలో అనంతారం కుర్మ సంఘం సభ్యులు 55వ రోజు రిలే నిరాహారదీక్షను చేపట్టారు. దీనికి జేఏసీ నాయకులు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు చిన్నపాపని కుమార్‌గౌడ్, రైతు సంఘం అధ్యక్షుడు సదానందరెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. అలాగే నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్ గ్రామాల్లో రిలే నిరాహారదీక్షలో రైతు జేఏసీ నాయకులు, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ డంపింగ్‌యార్డును రద్దు చేసే వరకు ఉద్యమం తీవ రూపం దాల్చుతుందన్నారు. రిలే నిరాహారదీక్షలను విద్యార్థుల పరీక్షలు ముగిసిన అనంతరం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. డంపింగ్‌యార్డు వల్ల ఇక్కడి గ్రామాల ప్రజలకు నష్టం వాటిల్లుతున్నా రాష్ట్ర పాలకవర్గం కనీసం స్పందించకపోవడం అన్యాయమన్నారు.
ప్రజాపాలన అని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు ప్రజలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి డంపింగ్‌యార్డు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోచుగారి మోహన్‌రెడ్డి, రవీందర్రెఇ్డ, దేవేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, దోమడుగు బాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, కుమ్మరి ఆంజనేయులు, మన్నె రామకృష్ణ, కొత్తపల్లి మల్లేశ్‌గౌడ్, కొరివి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.