హైదరాబాద్ : టీవీ చూడొద్దు అని తల్లిదండ్రులు మందలించినందుకు డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రోటిగూడ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మోత్కూరి లక్ష్మినారాయణ-దంపతుల చిన్న కూతురు అక్షయ డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నది.
చదువుకోకుండా తరచూ టీవీ చూస్తుండటంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో క్షణికావేశానికి లోనై అక్షయ ఈ నెల మూడున గడ్డి మందు తాగింది. గమనించిన స్థానికులు వెంటనే దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ అక్షయ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.