అవకాడోతో అభయం
మన గుండెకు అవకాడో అభయం ఇస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్నీ కాపాడుతుంది. అమెరికాకు చెందిన జర్నల్ ఆఫ్ క్లినికల్ లిపిడాలజీ తాజాగా నిర్వహించిన ఓ పరిశోధన.. ఈ విషయాన్ని తేల్చింది. ప్రస్తుతం చెడు కొలెస్ట్రాల్ సమస్య చాలామందిని వేధిస్తున్నది.
మన గుండెకు అవకాడో అభయం ఇస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్నీ కాపాడుతుంది. అమెరికాకు చెందిన జర్నల్ ఆఫ్ క్లినికల్ లిపిడాలజీ తాజాగా నిర్వహించిన ఓ పరిశోధన.. ఈ విషయాన్ని తేల్చింది. ప్రస్తుతం చెడు కొలెస్ట్రాల్ సమస్య చాలామందిని వేధిస్తున్నది. ఎలాంటి ఆహార నియమాలు పాటించినా, ఎన్ని మందులు వాడినా.. ప్రాణాలకు మీదికి తెస్తున్నది. అయితే, రోజుకు ఒకేఒక్క అవకాడో తింటే.. గుండె పదిలంగా ఉంటుందని జర్నల్ ఆఫ్ క్లినికల్ లిపిడాలజీ అధ్యయనం వెల్లడించింది.
ఈ అధ్యయనం కోసం అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న కొందరిని ఎంపిక చేశారు. వారిని రెండు బృందాలుగా విభజించి.. కొందరికి రోజూ తినే ఆహారంతోపాటు ఒక అవకాడో పండును అందించారు. రెండో గ్రూప్ వాళ్లకు మాములు ఆహారం పెట్టారు. ఆరు నెలల తర్వాత వాళ్లందరికీ రక్త పరీక్షలు నిర్వహించారు. ఇందులో రోజూ ఒక అవకాడో తిన్న వారి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌తోపాటు గుండె జబ్బుల ప్రమాదం దాదాపు 4 శాతం వరకు తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. ఇందుకు గల కారణాలను వివరిస్తూ.. అవకాడోలో మన శరీరానికి మేలుచేసే మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ సహజమైన కొవ్వు.. మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును బయటికి పంపడంలో సమర్థంగా పనిచేస్తుంది. ఇందులోని ఫైబర్.. మనం తినే ఆహారంలోని ఫ్యాట్‌ను పొట్ట, పేగులు పీల్చుకోకుండా అడ్డుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అవకాడాలో ఉండే పొటాషియం బీపీని అదుపులో ఉంచుతుందనీ, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడతాయని వివరిస్తున్నారు. అందుకే.. రోజువారీ ఆహారంలో అవకాడోను చేర్చుకోవడం వల్ల గుండెకు కొండంత రక్షణ లభిస్తుందని అంటున్నారు. అయితే, గుండెకు అవకాడో ఎంత మేలు చేసినప్పటికీ.. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తేనే గుండెకు పూర్తి రక్షణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

