పటాన్ చెరు, అక్టోబర్ 5: కిష్టారెడ్డి పేట శశ్మానవాటిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఓఆర్ఆర్ నెంబర్ 4 సర్వీస్ రోడ్డులో కెమికల్ డ్రమ్ములు తగలబెట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. శశ్మానవాటికలో కెమికల్ డ్రమ్ములను తగలపెట్టడంతో ఒక్కసారి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
రసాయనాల వాసనతో కూడిన పొగ కిలోమీటర్ మేరకు వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీరంగూడ ఖమ్మం నుంచి ఓఆర్ సర్వీస్ రోడ్డు వరకు పొగ వ్యాపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై దట్టమైన పొగ వ్యాపించడంతో పలువురికి ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది.