హైదరాబాద్ : ఐడీఏ బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గ్లోకెమ్ పరిశ్రమలోని ఓ బ్లాకులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.
సంఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఎస్ కృష్ణారెడ్డి తెలిపారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిర పీల్చుకున్నారు.