స్వీయ దర్శకనిర్మాణంలో ఎన్.ఎన్. ఆర్.చౌదరి హీరోగా నటించిన ‘నేను నా లల్లీ’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ఈ సినిమా ఆడియోను సీనియర్ దర్శకుడు రాజావన్నెంరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత ఎన్.ఎన్.ఆర్.చౌదరి చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.
ప్రతి కుటుంబం చూసి ఆనందించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సెన్సార్ సభ్యులు కూడా మా ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. తస్లీమ్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాసాచార్య, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: ఎన్.ఎన్.ఆర్.చౌదరి.