అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీ(Credit Chori ) కి పాల్పడుతూ గొప్పలు చెప్పుకుంటున్నారని వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ( Anil Kumar Yadav ) ఆరోపించారు. వైసీపీ హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులను తామే పూర్తి చేశామంటూ ప్రజలను తపుపదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
వెలిగొండ ప్రాజెక్టులో 80శాతం పనులు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని వెల్లడించారు.మార్కాపురంలో మెడికల్ కళాశాలను అడ్డుకుని తానే పూర్తి చేశానని గప్పలు కొడుతున్నారని విమర్శించారు. అదానీ డేటా సెంటర్ పేరు మార్చి క్రెడిట్ అనడం, విమానాశ్రయాల నిర్మాణాల క్రెడిట్ చోరీ చంద్రబాబుకే దక్కిందని అన్నారు. 1996లో శంకుస్థాపన చేసి ఎనిమిది సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క తట్టమట్టి ఎత్తిన దాఖలాలు లేవని ఆరోపించారు. కరోనా కాలంలోనూ పనులు చురుకుగా చేపట్టిన ఘనత వైఎస్ జగన్‌దేనని స్పష్టం చేశారు.