Ex Sarpanches | పెండింగ్ బిల్లు చెల్లించాలని అసెంబ్లీ ముట్టడికి వెళుతున్న మాజీ సర్పంచులను హత్నూర పోలీసులు గురువారం ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో గ్రామపంచాయతీలలో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టిన తమకు బిల్లు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.
రోజురోజుకు చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని బయలుదేరితే ముందస్తు అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
బిల్లులు చెల్లించలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్ధ పాలనకు త్వరలో బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. ముందస్తు అరెస్టు కాబడిన వారిలో సిరిపురం, నాగుల్దేవులపల్లి, మధుర గ్రామాల మాజీ సర్పంచులు విజయలక్ష్మి నరేందర్, సుధాకర్, మాధవి నవీన్ గౌడ్ ఉన్నారు.
TG Weather | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
KTR | అవయవ దానానికి సిద్ధం.. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేటీఆర్
మళ్లీ రోడ్లపైకి నీటి ట్యాంకర్లు.. జోరుగా నీటి దందా..!