జిన్నారం, మార్చి 13 : ఆలయాల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం గడ్డపోతారం గ్రామంలో జరిగిన కట్టమైసమ్మ జాతర ఉత్సవాలకు ఎమ్మెల్యే హాజరై జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, సర్పంచ్ ప్రకాశ్‌చారి స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. నియోజకవర్గంలో కొత్త ఆలయాల నిర్మాణాలకు, ఉత్సవాల నిర్వహణకు తాను తగిన సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. కట్టమైసమ్మ చాలా శక్తివంతమైన దేవత అని అమ్మవారి దయతో ప్రజలందరు చల్లగా ఉండాలని కోరారు.
సమస్యలు లేకుండా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్లే ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం తగిన పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. అన్ని రంగాలలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జనాబాయి, గుమ్మడిదల జడ్పీటీసీ కుమార్‌గౌడ్, ఉపసర్పంచ్ మమత, మాజీ సర్పంచ్ అశోక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, గుమ్మడిదల మండల అధ్యక్షుడు హుస్సేన్, జిల్లా నాయకుడు గోవర్దన్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, శంకర్, పులిగిల్ల శ్రీనివాస్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.