కంది : సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని కంది, మామిడిపల్లి, తునికిల్ల తండా గ్రామాలను ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి సందర్శించారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లోని పాఠశాలలో ఆయన పరిశీలించి విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. ఐఐటీ విద్యార్థులతో రూరల్ డెవలప్మెంట్ అంశంపై ప్రాజెక్టు నిర్వహించేలా ప్రణాళిక చేస్తామని ఆయన ఆ పాఠశాల సిబ్బందికి తెలియజేశారు.
అలాగే ఐఐటీ తరఫున చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్పడంతోపాటు ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
కంది గ్రామపంచాయతీకి వచ్చిన ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ మూర్తిని స్థానిక సర్పంచ్ విమల సన్మానించారు.
అనంతరం కంది గ్రామంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం తోపాటు కంది నుంచి ఐఐటీ వరకు రోడ్డుపై విద్యుద్దీపాలను ఏర్పాటు చేసేలా కృషి చేయాలని, అలాగే ఇతర అభివృద్ధి పనులు సహకరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.