రామచంద్రాపురం/గుమ్మడిదల, డిసెంబర్24: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పటాన్చెరు ఎమ్మెల్యే గూ డెం మహిపాల్‌రెడ్డి నియోజకవర్గంలోని అన్ని చర్చిలకు కేకులను పంపిణీ చేశారు. శనివారం పటాన్చెరు క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 305 చర్చిలకు క్రిస్మ స్ కేకులను సంబంధిత చర్చి నిర్వాహకులకు అందజేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పటాన్చెరు, రామచంద్రాపూరం, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో ఉన్న చర్చిలకు కేకులను పంపిణీ చేయడమే కాకుండా ముందస్తుగా క్రైస్తవు లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్సీపురం డివిజన్లో
ఆర్సీపురం డివిజన్లోని క్రైస్తవులకు కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పానగేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌లను శనివారం అందజేశారు. అదే విధంగా వివిధ చర్చిలకు ఆమె క్రిస్మస్ కేక్‌లను అందజేశారు. క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆర్సీపురం డివిజన్లోని శ్రీనివాస్‌నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ప్రకాశ్, సోహైల్, పాస్టర్లు పాల్గొన్నారు.
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన అధికారులు
జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావుకు పలువురు అధికారులు, బీఆర్ఎస్ నాయకులు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం జహీరాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయం లో కలసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జహీరాబాద్ సబ్ రిజిస్ట్రార్ రాజేశ్‌కుమార్, ఏజీపీ సాలమన్, ఎంవీఐ జయప్రకాశ్రెడ్డిలు కలిశారు.
శ్రీకృష్ణవేణి పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు
జహీరాబాద్ పట్టణంలోని అల్లీపూర్లో ఉన్న కృష్ణవేణి పాఠ శాలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. శనివారం పాఠశాలలో విద్యార్థులు క్రిస్మస్ వేడుకలో కేక్‌కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్ర మాలు నిర్వహించారు.
క్రిస్మస్కు చర్చిల ముస్తాబు
మండలంలోని గ్రామాల్లో చర్చిలలో బుధవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మండలం లోని మెటల్‌కుంట, రేజింతల్, మామిడ్గి, హద్నూర్, న్యాల్కల్, గుంజోట్టి, మిర్జాపూర్(బి), గంగ్వార్, చాల్కి, కాకిజనవాడ, రాఘవపూర్, ఇబ్రహీంపూర్ తదితర గ్రామాల్లో చర్చిలను రంగులు, రకరకాల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.
మంత్రి, ఎంపీలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిసిన జడ్పీటీసీ
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హారీశ్‌రావు, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్‌లకు మండల జడ్పీటీసీ స్వప్న కుమారి దంపతులు శనివారం హైదరాబాద్‌లో మంత్రి, ఎంపీ క్యాంపు కార్యాలయాల్లో వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
చింత ప్రభాకర్‌కు క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్‌ను న్యాల్కల్ జడ్పీటీసీ సభ్యురాలు స్వప్న భాస్కర్ కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంరతం చింతా ప్రభాకర్ క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
క్రైస్తవులకు ప్రభుత్వ క్రిస్మస్ కానుకలు అందజేత
క్రిస్మస్ కానుకలను బీఆర్ఎస్ మున్సిపల్ శాఖ అధ్యక్షుడు, కౌన్సిలర్ హన్మంత్‌రెడ్డి ఆధ్వ ర్యంలో శనివారం పంపిణీ చేశారు.
క్రిస్మస్ కిట్లు అందజేత
జిన్నారంలోని సియోన్ చర్చికి ప్రభుత్వం అందజేసిన క్రిస్మస్ కిట్లను ప్రజాప్రతినిధులు శనివారం అందజేశారు. ఉపసర్పంచ్ సంజీవ, బీఆర్ఎస్ నాయకులతో కలిసి మండలంలో ఉన్న 16 చర్చిల ఫాదర్లకు 267కిట్లను అందజేశారు.
అకాడమిక్ హైట్స్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ అకడమిక్ హైట్స్ పాఠశాలలో శనివా రం క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు క్రిస్మస్ విశిష్టత గురించి ఉపాధ్యాయులు వివరించారు. విద్యార్థులు క్రిస్మస్పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు శ్రీనివాసరావు, శిరిషా, ప్రిన్సిపాల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.