Sangareddy : గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అనంత్ సాగర్లో కౌంటింగ్ ఉత్కంఠగా సాగింది. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కంటే బీఆర్ఎస్ మద్దతు పలికిన బేగరి నర్సింలు(Begari Narsimlu)కు ఒకే ఒక ఓటు ఎక్కువ వచ్చింది.
అయితే.. ఎన్నికల్లో పోలైన 30 ఓట్లను చెల్లని ఓట్లుగా అధికారులు ప్రకటించారు. దాంతో.. రీ-కౌంటింగ్ జరపాలని కాంగ్రెస్ అభ్యర్థి డిమాండ్ చేశారు. రీ- కౌంటింగ్ లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి నర్సింలుకు ఒక ఓటు ఎక్కువ వచ్చింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఎన్నికల్లో ఆయన ఒకేఒక ఓటుతో సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు.