నారాయణఖేడ్, జనవరి 2: విద్య, వైద్యంపై సీఎం కేసీఆ ర్ ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ వహించి అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో రూ.15లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ప్రారంభించారు. అనంతరం మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ విద్యాలయంలో జూనియర్ కళాశాలను ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రజావసరాలను గుర్తించి విద్య, వైద్యరంగాలను మెరుగుపరుస్తున్నాడన్నారు. నారాయణఖేడ్‌లో వందపడకల దవాఖానను ఏర్పాటు చేయడంతో పాటు త్వరలో 50పడకల మాతాశిశు దవాఖానను సైతం ప్రారంభించనున్నట్లు చెప్పారు. పట్టణం లో మరో రెండు పీహెచ్సీ సబ్సెంటర్లతో పాటు కల్హేర్, కరస్‌గుత్తి పీహెచ్‌సీలను 30 పడకలకు విస్తరించడమే కాకుండా నిజాంపేట్, సిర్గాపూర్ పీహెచ్‌సీలకు కొత్త భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై రూ. 1.20లక్షలను ఖర్చు చేస్తూ నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన విద్యాబోధనను అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి గాయత్రీదేవి, వైద్యాధికారి డాక్టర్ రాహుల్చౌహన్, మాజీ సర్పంచ్ ఎం.ఏ.నజీబ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ పరశురామ్, మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, కౌన్సిలర్లు మాజిద్, నర్సింహులు, మైనార్టీ బాలికల, బాలుర విద్యాలయాల ప్రిన్సిపాల్లు మంజుల, ఎం.ఏ. ఖాదర్, నాయకులు అభిషేక్ శెట్కార్, రవీందర్‌నాయక్, రమేశ్చౌహన్, లయక్, అం బాదాస్ విఠల్, సంజీవ్‌రెడ్డి, గౌస్చిష్తి పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ నిరుపేద ఆడపిల్లల తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ఆడపిల్లల పెండ్లికి రూ. 1లక్ష 116లను అందించి చేయూతనిస్తుందన్నారు.
కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన
సిర్గాపూర్, జనవరి 2: సిర్గాపూర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, స్థానిక ఎంపీపీ జార మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీలతో కలిసి శంకుస్థాపన చేశారు. స్థానికంగా భవనం శిథిలమైనందున కొత్తగా భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1.56కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. దీంతో పాత భవనన్ని తొలిగించి అదే స్థలంలో కొత్త భవనాన్ని నిర్మిస్తు న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూ ల ప్రాంతంలో కూడా వైద్య సేవలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కొత్త భవనంలో సరికొత్త సదుపాయాలతో అందుబాటులో ఉంటాయన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రిదేవి, స్థానిక వైద్యాధికారి నిఖిత, తహసీల్దార్ రత్నం, సర్పంచ్ జంగం స్వప్న, ఎంపీటీసీ పీరప్ప, మండల రైతుబంధు అధ్యక్షుడు కృష్ణమూర్తి, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవరావు, యాదవరావు, ఉప సర్పంచ్ రాజు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు గ్రామస్తులు పాల్గొన్నారు.