మనూరు, జూలై 10 : ఉల్లి రైతులు ప్రభుత్వం అంధిస్తున్న రాయితీ కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఏఈఓ సంగమేశ్వర్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా మనూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉల్లి సాగు చేస్తున్న రైతులకు రాయితీ కోసం పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఇందు కోసం రైతులు అప్లికేషన్ ఫామ్‌తో పాటు ఉల్లి సాగు చేస్తున్న సర్వే నంబరు పట్టదారు పాస్ పుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోను వ్యవసాయ అధికారులకు అందజేయాలని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.