Highway Lights | గుమ్మడిదల, జూన్4 : ఇది బాలానగర్ నుంచి మెదక్ వరకు ఉన్న జాతీయ రహదారి (765డీ) ఈ హైవే ఆధునీకరించినప్పటి నుంచి హైవేకు అయిన ఖర్చులను తీసుకోవడానికి గుమ్మడిదల మండల శివారులో టోల్ ప్లాజా కూడా ఏర్పాటు చేశారు. ఈ దారి మీదుగా పోవాలంటే ప్రతీ వాహనం టోల్ టాక్స్ చెల్లించవలసిందే. టోల్ టాక్స్‌ల వసూలు మీద ఉన్న శ్రద్ధ హైవేపై లైట్స్ ఏర్పాటుపై లేకపోవడంతో హైవేపై అంధకారం నెలకొంటుంది.
గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు మున్సిపల్ వార్డు మీదుగా వెలుతున్న హైవేపై అమరవీరుల స్థూపం నుంచి యూటర్స్ మీదుగా వెలుతున్న డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు లైటింగ్ లేకపోవడంతో అంధకారమయంగా దర్శనమిస్తుంది. అంతే కాకుండా దోమడుగు యూటర్న్ వద్ద పగటి పూటనే వారంలో ఒకరోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదంలో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు.
మరి రాత్రివేళలో హైవే అంధకారంగా ఉంటే ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి అంటూ హైవే అథారిటీ అధికారులను స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారుల ప్రయాణానికి సహకరించాలని స్థానిక ప్రజలు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ACB Summons: 2 వేల కోట్ల స్కామ్‌లో సిసోడియా, సత్యేంద్రకు ఏసీబీ సమన్లు
MLC Kavitha | కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే నోటీసులు.. రేవంత్ సర్కారుపై కవిత ఫైర్..
Karimnagar | తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. నగదు, బియ్యం బస్తాలు ఎత్తుకెళ్లిన దొంగలు