సంగారెడ్డిలోని పరిశ్రమలో ప్రమాదం జరిగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఇనుప రాడ్లు మీద పడటంతో ఇద్దరు కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు కార్మికులు ఈ ప్రమాదంలో గాయపడ్డారని అధికారులు తెలియజేశారు.
పటాన్చెరు మండలం నందిగామ శివారు పరిశ్రమలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రేమ్‌కుమార్, పాజ్తార్గా గుర్తించారు.