నారాయణఖేడ్, మార్చి 18 : చెట్టుకు ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణఖేడ్ మండలం నిజాంపేట్లో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోగుల చిన్న కృష్ణ(35) గత కొంత కాలంగా తన భార్య రుక్మిణితో ఏర్పడిన వివాదాల కారణంగా భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు.
ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన కృష్ణ గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన గల చింత చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా మృతుడికి భార్య, కూతురు నవ్యశ్రీ ఉన్నారు.