సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 23 : జిల్లావ్యాప్తంగా ఈ నెల 20వ తేదీలోగా పట్టా పాస్బుక్ వచ్చిన రైతులందరూ రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారంతో పాటు పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా పత్రాలతో జనవరి 3వ తేదీలోగా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలని సూచించారు.
ఇప్పటికే రైతుబంధు డబ్బులు వస్తున్న రైతులు జీరాక్స్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. బ్యాంకు ఖాతా మార్చుకోవాలనుకుంటే ఈ నెల 27లోగా వ్యవసాయ విస్తరణ అధికారికి ఇవ్వాలని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 21, 576 మంది రైతులకు పట్టా పాసుపుస్తకాలు వచ్చాయని ఆయన వివరించారు.