
గుమ్మడిదల, ఆగస్టు 23 : నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మండల బ్రాహ్మణ సంఘం భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘం భవన నిర్మాణానికి రూ.25 లక్షల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. గ్రామాలకు బ్రాహ్మణులు భూదేవతలుగా పూర్వకాలం నుంచి వెలుగొందుతున్నారని, వారి కోసం జిల్లాలోనే ప్రథమంగా బ్రాహ్మణ సంఘం భవనం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఆరు నెలల్లో భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా మండల కేంద్రంలో నిర్మించనున్న బ్రాహ్మణ సంఘం భవనానికి గుమ్మడిదల మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ యువ నేత ఇందెల సురేందర్‌రెడ్డి లక్ష రూపాయల చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా బ్రాహ్మణ సంఘం సభ్యులకు అందజేశారు. అనంతరం సంఘం సభ్యులు ఎమ్మెల్యే, మాజీ సర్పంచ్, తహసీల్దార్ సుజాత, జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్, సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, సద్ది విజయభాస్కర్‌రెడ్డి, గటాటి భద్రప్ప, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా నాయకుడు హుస్సేన్, సర్పంచ్ రాజశేఖర్, ఉపసర్పంచ్ మొగులయ్య, బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌శర్మ, సభ్యులు కిషన్, ప్రసాద్, రామశర్మ, రవీందర్కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.
గుమ్మడిదలను మోడల్ మండలంగా తీర్చిదిద్దుతాం..
గుమ్మడిదల, ఆగస్టు 23 : నూతనంగా ఏర్పడిన గుమ్మడిదల మండల కేంద్రాన్ని మోడల్ మండలంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం గుమ్మడిదలలో రూ.13 లక్షల జిల్లా పరిషత్ నిధులతో ఆధునీకరించిన సీసీ రోడ్డును, రూ.15 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతామని హామీ ఇచ్చారు. పేదల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమ లు చేస్తున్నారని తెలిపారు. సమైక్య పాలనలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలు.. సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో దూసుకుపోతున్నాని చెప్పారు.
రైతుబంధు నుంచి దళితబంధు వరకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. దశలవారీగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుమార్‌గౌడ్, సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో చంద్రశేఖర్, ఈవోపీఆర్డీ సురేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, సద్ది విజయభాస్కర్‌రెడ్డి, గటాటి భద్రప్ప, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, మంద భాస్కర్‌రెడ్డి, సర్పంచ్ రాజశేఖర్, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల విష్ణువర్ధన్‌రెడ్డి, ఉపసర్పంచ్ మొగులయ్య, ఎంపీటీసీ పద్మాకొండల్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.