పదో తరగతి ఫలితాల్లో 97.29 శాతం ఉత్తీర్ణతతో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. విద్యాశాఖ రిజల్ట్స్ బుధవారం ప్రకటించింది. మొత్తం 21,358 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 20,780 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 10,713 మంది పరీక్షలు రాయగా, 10,367 మంది, బాలికలు 10,645 మందికి 10,413 మంది పాసయ్యారు. గతేడాది మూడో స్థానం పొందగా, ఈ సంవత్సరం సైతం అదే స్థానం దక్కించుకుంది.
మెదక్ జిల్లా 90.84 శాతం ఉత్తీర్ణతతో 13వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరంతో పోలిస్తే రెండు స్థానాలు దిగజారింది. మొత్తం 10,680 విద్యార్థులకు 9,702 మంది పాసయ్యారు. వీరిలో 67మంది మాత్రమే పది జీపీఏ సాధించారు. బాలురు 88శాతం, బాలికలు 93.శాతం ఉత్తీర్ణులయ్యారు.
-సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ, మే 10