ఝరాసంగం, ఫిబ్రవరి 28 : పల్లెలోని రోడ్లన్నీ సీసీ రోడ్లుగా మార్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని బోరేగావ్, దేవరంపల్లి, ఈదులపల్లి, కొల్లూర్ గ్రామాల్లో ఆయన సీడీసీ చైర్మన్ ఉమాకాంత్పాటిల్తో కలిసి సీసీ రోడ్లు పనులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంజీఆర్ జీఎస్ నిధుల నుంచి రూ. 40లక్షల వ్యయంతో 1040 మీటర్ల సీసీరోడ్డు నిర్మాణ పనులను చేపడుతున్నామన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కార్యక్రమంలో సర్పంచులు మోహన్, శశికళ, బస్వరాజ్పటేల్, సావిత్రి, బొగ్గుల జగదీశ్వర్, ఎంపీటీసీలు విజేందర్‌రెడ్డి, శంకర్‌పటేల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచయ్యస్వామి, రైతు సమన్వయ మండల కన్వీనర్ సుభాశ్‌రావు, కేతకీ ఆలయ మాజీ చైర్మన్ హనుమాన్పటేల్, టీఆర్ఎస్ నాయకులు సంగమేశ్వర్, పండరినాథ్, సంగన్నపటేల్, నాగేందర్, బస్వరాజ్, నరసింహులు, రాజు పాల్గొన్నారు.
న్యాల్కల్లో..
న్యాల్కల్ : మండలంలోని మామిడ్గి, గణేశ్‌పూర్ గ్రామాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రూ. 10లక్షల వ్యయంతో మంజూరైన సీసీరోడ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ అంజమ్మ, వైస్ చైర్మన్ గౌసొద్దీన్, సర్పంచులు చంద్రన్న, లక్ష్మి, ఉప సర్పంచులు శరణయ్యస్వామి, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి కృష్ణ, మండల అధ్యక్షుడు రవీందర్, మండల నాయకులు నర్సింహారెడ్డి, భాస్కర్, తుక్కారెడ్డి, కిష్టారెడ్డి, మానిక్రెడి పాల్గొన్నారు.