న్యాల్కల్, జనవరి 4 : న్యాల్కల్ ఎంఆర్సీ కార్యాలయంలో మంగళవారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా స్థానిక కార్యాలయంలో మండలంలోని హద్నూర్, న్యాల్కల్, చాల్కి, కేజీవీబీ న్యాల్కల్ పాఠశాలల్లోని విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి లావణ్య, విద్యాధికారి మారుతీ రాథోడ్ వ్యాసరచన పోటీలను పరిశీలించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి అజింక్యా, వ్యవసాయ విస్తరణ అధికారి మహేశ్, హెచ్ఎం యాదయ్య, ఉపాధ్యాయులు రమేశ్‌రెడ్డి, అనంతరామ్, ప్రసాద్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈదులపల్లి జడ్పీహెచ్ఎస్లో
ఝరాసంగం, జనవరి 4: రైతు బంధు సంబురాల వారోత్సవాల్లో భాగంగా ఈదులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రణళికాబద్ధంగా 8, 9,10వ తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించామని మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశం అన్నారు. ఈ నెల 10వరకు వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు సుభాష్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచయ్యస్వామి, సర్పంచ్ బస్వరాజ్, ఎంపీటీసీ శంకర్‌పటేల్, ఉప సర్పంచ్ ఏసయ్య, ఏఈవో సుకుమార్, గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షుడు సిద్ధయ్యస్వామి, నగేశ్పటేల్ పాల్గొన్నారు.
డాకూర్, అక్సాన్పల్లిలో
అందోల్, జనవరి 4: రైతుబంధు సంబురాల్లో భాగంగా డాకూర్, అక్సాన్‌పల్లి క్లస్టర్ల పరిధిలోని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని జోగిపేట ఏడీఏ అరుణ తెలిపారు. పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించడంతో పాటు వ్యవసాయ రంగం ప్రాముఖ్యతను వివరించామని తెలిపారు. విద్యార్థులు వ్యవసాయంపై అవగాహన కలిగివుండాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో కృష్ణ, ఏవో విజయరత్న, ఏఈవో శ్రీకర్, శ్రీనివాస్, ఆత్మకమిటీ బీటీఎం రవీందర్, హెచ్ఎం విశ్వనాథం పాల్గొన్నారు.
వాసర్ హైస్కూల్లో
సిర్గాపూర్, జనవరి 4: వాసర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రైతుబంధు పథకం అమలు తీరుపై వ్యవసాయాధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏఈవో శ్వేత మాట్లాడుతూ రాష్ట్ర సర్కారు రైతులకు వానకాలం, యాసంగి వ్యవసాయ సాగు పెట్టుబడుల కోసం సీజన్‌వారీగా రెండు దఫాలు అందిస్తున్నారని తెలిపారు. ఈమేరకు విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించామని, ఇందులో విద్యార్థులకు పోత్సాహక బహుమతులు అందజేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం హమీద్, సర్పంచ్, ఎంపీటీసీ ఉన్నారు.