
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలుమెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 20: వరలక్ష్మీ వ్రతాలను జిల్లా కేంద్రంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేయడం అనవాయితీగా వస్తున్నది. శుక్రవారం ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలతో పాటు సామూహిక వ్రతాలు మహిళలు పెద్దఎత్తున పాల్గొని చేశారు. జిల్లా కేంద్రంలోని ఆనాది హనుమాన్,కాళికదేవి,రేణుకాంబ ఆలయాల్లో సా మూహిక వ్రతాల్లో మహిళలు పాల్గొన్నారు.
పెద్దశంకరంపేటలో..
పెద్దశంకరంపేట ఆగస్టు 20: శ్రావణమాసం రెండో శుక్ర వారాన్ని పురస్కరించుకొని పెద్దశంకరంపేటలోని సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ప్రత్యేక పూ జలు నిర్వహించి సామూహిక కుంకుమార్చనలు, వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో హాజరై వ్రతా లు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నా రు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు వీరప్ప పూజారి కృష్ణశర్మ, ఆచార్యులు, మాతాజీలు, పాఠశాల కమిటీ స భ్యులు క్రాంతిలాల్, పున్నయ్య, రవివ ర్మ, సీతారామరావు, సతీష్, మధు, శ్రావణ్, పూ ర్వ విద్యార్థులు, పాల్గొన్నారు.
సామూహిక వరలక్ష్మీవ్రతాలు
పాపన్నపేట,ఆగస్టు 20: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు.ఇందులో భాగం గా మహిళలు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల పరిధిలోని యూసుఫ్‌పేటలోని సాయిబాబా ఆలయంలో మహిళలు సామూహిక వరలక్ష్మీవ్రతాలు చేపట్టారు. సుమారు 200మంది పూజలో పాల్గొనగా వడ్డేపల్లి సంజీవరెడ్డి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, సంజీవరెడ్డి, నరసింహరెడ్డితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.