
పాపన్నపేట, ఆగస్టు 18: న్యూమోనియా వ్యాధి నుంచి చిన్నారులను రక్షించడానికి టీకా వేస్తున్నామని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో న్యూమోనియా వ్యాధి నిరోధక టీకా వేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూ మోనియా న్యూమోకాస్ బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నారు. న్యూమోనియా వల్ల ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఈ టీకా మూడు దఫాలుగా ఇస్తామని మొదటి విడతగా నెలన్నరకు, రెండో విడత మూడున్నర నెలలకు, బూస్ట ర్ టీకా తొమ్మిది నెలల అనంతరం చిన్నారులకు వేస్తున్నామని ఈ సదావకాశాన్ని చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియో గం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ హరిప్రసాద్, సీహెచ్వో చందర్, సూపర్వైజర్లు మేరి, పాల్గొన్నారు.
పెద్దశంకరంపేట, ఆగస్టు18: చిన్నారులకు పీసీ వీ టీకాలు తప్పకుండా వేయించాలని వైద్యాధికారి పుష్పలత అన్నారు. స్థానిక ప్రభుత్వ ద వాఖానలో చిన్నారులకు పీసీవీ టీకాలు వేసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడాది లోపు చిన్నారులకు టీకాలు తప్పనిసరిగా వేయించాలన్నారు. కార్యక్రమం లో పీహెచ్సీ సిబ్బంది సాయిలు, భూ మయ్య, యాదయ్య, వెంకటేశం, కమల, స్వరూప, పాల్గొన్నారు.