జహీరాబాద్, అక్టోబర్ 9 : హైదరాబాద్ నుంచి అక్రమంగా రేషన్ బియ్యా న్ని మూడు కంటైనర్‌లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. జహీరాబాద్ డీఎస్పీ శంకర్రాజు నేతృత్వంలో శనివారం సాయంత్రం మండలంలోని చిరాగ్పల్లి శివారులో పోలీసులు పట్టుకొని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు. 1200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని లారీలో అక్రమంగా తరలిస్తున్నారు. హై దరాబాద్‌లోని రేషన్ బియ్యం డీల్లర్లు, లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి అక్రమంగా గుజరాత్‌కు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. జహీరాబాద్ డీఎస్పీ శంకర్రాజు, పట్టణ సీఐ రాజశేఖర్, చిరాగ్పల్లి ఎస్సై కాశీనాథ్, డిప్యూటీ తహసీల్దార్లు షఫియొద్దీన్, సురేశ్, శ్రీనివాస్ సీజ్ చేసి రేషన్ బియ్యాన్ని గోదాంలో నిల్వ చేశారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఎవరైనా రవా ణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ రహదారిపై ప్రత్యే క నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.