చేర్యాల/మద్దూరు(ధూళిమిట్ట), జూలై 21: ఇసుకను వాగుల నుంచి రాత్రి, వేకువజాము న లేదా సెలవు రోజుల్లో పలువురు అక్రమం గా రవాణా చేసి కాసులు సంపాదించుకునే వారు. కానీ, సిద్దిపేట జిల్లా చేర్యాల, ధూళిమిట్ట ప్రాంతాలకు చెందిన ఇసుకాసురులు తమ ైస్టెల్‌ను మార్చి మరో ట్రెండ్‌ను సెట్ చేసి అక్రమ ఇసుకను సక్రమంగా రవాణా చేస్తూ ‘మూడు డంపుల్లో ఇసుకను ఆరు ట్రాక్టర్ల ద్వారా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నా రు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూ రు, ధూళిమిట్ట మండలాల్లోని వాగుల నుంచి ఇసుకను తరలించేందుకు ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో ఇసుకను అక్రమంగా రవాణా చేసి కాసులు కూడబెట్టుకోవాలనుకునే ఇసుకాసురులు ఇప్పుడు కొత్తరకంగా ఆలోచన చేసి దానిని పక్కాగా అమలు చేస్తున్నారు.
చేర్యాల మండలంలోని కక్కాయపల్లి, ధూళిమిట్ట మండలంలోని జాలపల్లి గ్రామాల సమీపంలో ఉన్న వాగుల నుంచి మొదటగా స్థానిక అవసరాలంటూ ఇసుకను తరలిస్తు న్నారు. రవాణా చేసుకునేందుకు అనువుగా ఉండే ప్రైవేట్ వ్యక్తులు, మామిడి తోటల్లో డం పులు చేస్తున్నారు. అనంతరం గ్రామానికి చెం దిన కొందరు వ్యక్తుల ద్వారా రెవె న్యూ, పోలీస్, టాస్క్‌ఫోర్స్ అధికారులకు డం పులు ఉన్న చోటును ఫోన్లో సమాచారం అందిస్తున్నారు. సంబంధితశాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి వెళ్లి డంపును పట్టుకున్నట్లు ఫొటోలు దిగి దానిని సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.
ఇసుక రవాణాదారులు వేసిన పథకం ప్రకా రం అధికారులు రావడం, డంపులు పట్టుకోవడం జరిగిపోయిన అనంతరం రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి స్వాధీనం చేసుకున్న ఇసుకకు వేలం వేస్తున్నట్లు మొదటగా ప్రకటనలు ఇస్తున్నారు. అనంతరం వేలం పాటలు నిర్వహించే రోజు ఎవరైతే డం పులు చేయించారో వారి బినామీల ద్వారా 50 నుం చి 100 ట్రాక్టర్లు లభించే ఇసుకనకు నామమాత్రంగా రూ.50వేల నుంచి లక్షన్నర వర కు పాట పాడించి హక్కులు దక్కించుకుంటున్నారు. ఇదే ఇసుక బహిరంగ మార్కెట్లో 50 ట్రిప్పులు అయితే రూ.2లక్షలు, 100 టిప్పులు అయితే 4లక్షలకు పైగా ఉంటుంది.
అధికారుల వేలం పాట పూర్తికాగానే ఇసుక డంపును స్థానిక, ఇతరత్రా అవసరాలకు విక్రయించుకోవచ్చని ఒక అనుమతి పత్రం హ క్కులు దక్కించుకున్న వ్యక్తి అందిస్తున్నారు. దీనిని అదునుగా చేసుకుని ఇసుకాసురులు సిద్దిపేట, దుద్దెడ, నంగునూరు, చేర్యాల, మద్దూరు మండలాల్లోని వివిధ గ్రామాలకు ఇసుకను రవాణా చేస్తున్నారు. అధికారులు ఇచ్చిన అనుమతి పత్రం లో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తీసుకుపోయే ట్రాక్టర్ల నంబర్లు పొందుపరుస్తున్నారు.కానీ రవాణాదారులు మాత్రం అనుమతి ఇచ్చిన నం బర్ల ట్రాక్టర్లు, ట్రక్కులే కాకుండా మరికొన్ని ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రవాణా చేస్తున్నారు.
ధూళిమిట్ట మండలంలోని జాలపల్లిలో ఇప్పటికీ మూడుసార్లు, చేర్యాల మండలంలోని కమలాయపల్లిలో రెండు సార్లు అధికారులు డంపులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాన్ని పట్టుకుని ఇక ట్రాక్టర్ల ద్వారా రవాణాదారులు ధూళిమిట్ట మండలంలోని కమలాయపల్లి నుంచి చేర్యాల మండలంలోని మాసిరెడ్డిపల్లి, ఆకునూరు, రాంపూర్ మీదు గా మద్దూరు మండలంలోని నర్సాయపల్లికి ఇసుక తీసుకుపోతున్నారు.అనుమతి పొం దిన రోజు నుంచి డం పు పేరిట వాగుల నుం చి మరింత ఇసుకను తీసి విక్రయిస్తున్నారు. రవాణా విషయంలో ఎవరైనా ప్రశ్నిస్తే అనుమతి ఉందని సదరు పత్రం చూపిస్తున్నారు.
వాగుల నుంచి తీసిన ఇసుకను ప్రైవేట్ వ్య క్తుల ప్రదేశాల్లో డంపు చేసినప్పడు ఏవ్యక్తి అయినా తమ స్థలంలో ఎందుకు డంపు చేస్తున్నారని, ఎవరు పోస్తున్నారే విషయాన్ని తెలుసుకుంటారు. డంపులు దొరికిన స్థలానికి చెందిన వ్యక్తిని ఎవరు డంపులు చేశారనే విషయాన్ని అధికారులు ప్రశ్నించకపోవడం, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆఫీసర్ల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఎవరి స్థలంలో అయితే ఇసుక డంపు అవుతుందో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే మరోచోట ఇసుక డంపు చేసేందుకు ఇసుకాసురులు వెనుకడుగు వేస్తారనే విషయాన్ని అధికారులు ఎందుకు విస్మరిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాల్సిన రెవె న్యూ, పోలీస్ అధికారులు, సిబ్బందిపై ప్రజ లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారు అనుకుంటే ఆపుతారని పేర్కొంటున్నారు.