రామాయంపేట/ చిన్నశంకరంపేట, జనవరి 11 : గ్రామాల దూరాన్ని తగ్గిస్తూ ప్రజలను దగ్గరికి చేస్తున్న ఆర్టీసీ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మెదక్ డిపో అసిస్టెంట్ మేనేజర్ లక్ష్మణ్నారాయణ అన్నారు. ప్రతి పల్లెకు బస్సును నడిపిస్తున్నట్లు, ఆర్టీసీ బస్సుల్లో సురక్షితం గా ప్రయాణించాలని సూచించారు. రామాయంపేట బస్‌స్టేషన్‌లో కళాకారులు ఆటపాటలతో ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను వివరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్నారాయణ మాట్లాడుతూ.. ప్రతి పల్లెకు బస్సు నడపాలని ఆర్టీసీ లక్ష్యం గా పెట్టుకుందన్నారు. దూరప్రాంత ప్రయాణికులు 20 రోజుల చార్జీ చెల్లించి, నెలరోజుల పాటు ప్రయా ణం చేయవచ్చన్నారు. పెండ్లి, ఇతర ఫంక్షన్లకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇస్తామని తెలిపారు. బస్సుల్లో వా ట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది సంపత్‌కుమార్, పెంటోజి, బాబూ జీ, శ్రీహరి, గోపన్న, కుమారస్వామి, రమణ ఉన్నారు.
చిన్నశంకరంపేటలోని గవ్వలపల్లి చౌరస్తాలో కళాకారులు కళా ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించాలని ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో కళాకారులు సంపత్, శ్రీహరి, గోపన్న, వేణుగోపాల్, స్వామి, శ్రీను, వెంకటేశ్, సురేందర్ పాల్గొన్నారు.