సదాశివపేట, జనవరి1: సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని అయ్యప్ప మందిరం లో బుధవారం మున్సిపల్ వైస్‌చైర్మన్, గురుస్వామి చింతా గోపాల్ 29వ ఇరుముడి మహా పడిపూజ జరిగింది. మహాపడి పూజకు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హాజరుకాగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మా ణిక్‌రావు పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భం గా గురుస్వాములు హరీశ్‌రావును శాలు వా, పూలమాలతో సన్మానించి ఆశీర్వదించారు.
అనంతరం హరీశ్‌రావు మా ట్లాడుతూ చింతా గోపాల్ 29వ ఇరుము డి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అయ్యప్పస్వాములు, భక్తులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మహాపడి పూజలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. అయ్యప్పస్వామి చాలా మహిమగల స్వామి అని, ఆయన దీవెనలు పొందని వారు ఉండరన్నారు. చాలా నిష్టతో చేస్తున్న స్వాములకు, రాష్ట్ర ప్రజలందరికీ ఆయన నూతన సంవత్స ర శుభాకాంక్షలు తెలిపారు.
అయ్యప్పస్వామి మహాపడి పూజకు వేలాది మం ది అయ్యప్పభక్తులు, మహిళలు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. అయ్యప్ప భక్తులు భజన పాటలు, నృత్యాలతో ఉత్సాహం నింపారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్‌చైర్మన్ పట్నం మాణిక్యం, సీడీసీ మా జీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, నాయకులు శివరాజ్‌పాటిల్, చింతా సాయినా థ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి వీరేశం తదితర నాయ కులు పాల్గొన్నారు.