టేక్మాల్, అక్టోబర్ 22 : మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో స్థానిక యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్తవాలను ఘనంగా నిర్వహించారు. సదర్ ఉత్సవాలతో గ్రామంలో కోలాహలం నెలకొంది. దీపావళి తర్వాత ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను జరుపుకోవడం అనవాయితీగా వస్తుంది.
అందంగా అలంకరించిన దున్నపోతులను డీకే పాటలకు అనుగుణంగా ఆడిస్తూ విన్యాసాలు చేయించారు.
ఈ సంబురాల్లో దుమ్ము రేసే దున్నరాజు విన్యాసాలు అందరిని అలరించాయి. ఈ వేడుకలను చూడటానికి మండల పరిధిలోని ఆయా గ్రామాల నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో రాజు, మల్లేష్, కార్తీక్, మల్లేశం, పోచయ్య, మల్లేష్, భాను, కిష్టయ్య. మొగులయ్య. ఎల్లయ్య తదితరులు ఉన్నారు.