పటాన్చెరు రూరల్, జూన్ 29: ఇక వీల్‌చైర్‌పై ప్రయాణించే దివ్యాంగులు, పేషెంట్లు కూడా తేలిగ్గా ర్యాంపు ద్వారా ఆర్టీసీ బస్సులోకి ఎక్కవచ్చు. వారే ర్యాంపు పైనుంచి తేలిగ్గా దిగవచ్చు. ఇస్నాపూర్‌లో రాష్ట్ర కండర క్షీణత వ్యాధి బాధిత సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.రవికుమార్ ఆదివారం సికింద్రాబాద్ వెళ్లే బస్సులో ఇస్నాపూర్ బస్టాప్‌లో ర్యాంప్‌ను వాడి బస్సులోకి ఎక్కారు.
ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సుల్లో ఈ సౌకర్యం కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఎలక్ట్రికల్ ట్రై సైకిల్‌పై వచ్చిన రవికుమార్‌కు డ్రైవర్, కండక్టర్ సహకరించి ర్యాంప్‌ను అమర్చారు. ర్యాంప్ ద్వారా తేలిగ్గా రవికుమార్ బస్సులోకి ఎక్కారు. ఈ సౌకర్యాన్ని దివ్యాంగులు, పేషెంట్లు వాడుకోవచ్చని రవికుమార్ తెలిపారు. చార్జ్జింగ్ బస్సుల్లో ఈ సదుపాయంతో పాటు ఇతక సౌకర్యాలు ఉండేలా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చర్యలు తీసుకున్నారని, దివ్యాంగులు ఇక మీదట ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం ఆర్టీసీ కల్పించిందని తెలిపారు.