మెదక్, ఫిబ్రవరి 23 : మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా ప్రా జెక్టుకు సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం సిద్దిపేట జిల్లా తుక్కాపూర్‌లో మల్లన్నసాగర్‌ను ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టుకు రూ.100 కోట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పార్టీ శ్రేణులు క్షీరాభిషేకం చేశారు. అంతకుముందు పెద్ద ఎత్తున పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏడుపాయలను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని గతంలో సీఎం కేసీఆర్‌కు విన్నవించామని తెలిపారు. మెదక్ జిల్లాకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా వంద కోట్లు ప్రకటించిన దాఖలాలు లేవన్నారు. నాలుగు రాష్ర్టాల నుంచి భక్తులు ఏడుపాయలకు వస్తుంటారని, టూరిజంలో భాగంగా వనదుర్గా ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. వనదుర్గామాత ఆశీస్సులు సీఎం కేసీఆర్‌కు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.
మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులతో తెలంగాణలోని ఏడు జిల్లాలు సస్యశ్యామలమవుతున్నాయని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. లక్షల ఎకరాల్లో బం గారు పంటలు పండబోతున్నాయని, హల్దీవాగు, సింగూరు, ఘనపూర్ ప్రాజెక్టులకు కూడా కాళేశ్వరం నీళ్లు వస్తాయని తెలిపారు. కోర్టులో కేసులు వేసి ప్రాజెక్టులను ఆపాలని ప్రతిపక్షాలు చూసినా.. సీఎం కేసీఆర్ అన్ని ప్రాజెక్టులను పూర్తి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రైతుల పాదాలను గోదావరి జలాలతో కడుగుతానని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటా నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మార్కె ట్ కమిటీ చైర్మన్ జగపతి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి కృష్ణాగౌడ్, కౌన్సిలర్లు సమీయొద్దీన్, జయరాజ్, శ్రీనివాస్, సుంకయ్య, హవేళీఘనపూర్, పాపన్నపేట టీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు శంకర్, సాయిలు, టీఆర్ఎస్ నాయకులు మధుసూదన్‌రావు, దుర్గాప్రసాద్, ప్రవీణ్‌గౌడ్, ప్రభురెడ్డి, శ్రీధర్‌యాదవ్, నర్సింహులు, బాలాగౌడ్, విష్ణువర్ధన్‌రెడ్డి, జయరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.