మునిపల్లి, ఆగస్టు 4: హాస్టళపై అధికారుల పర్యవేక్షణ కరువై విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరా మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ గురుకుల కళాశాల విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. మెస్ కాంట్రాక్టర్ నాసిరకం కూరగాయలతో భోజనం పెడుతున్నట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. బుధేరా మహిళా డిగ్రీ కళాశాలపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో హాస్టల్లో విద్యార్థినులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందడం లేదు.
హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న సుమా రు 400 మంది వరకు విద్యార్థినులకు నాసి రకం కూరగాయలు, కుళ్లిన కూరగాయలతో భోజనాలు పెడుతుండడంతో అనారోగ్యం బారినపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మెనూ సరిగ్గా అమలు చేయడం లేద ని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినులకు క్రమం తప్పకుండా ఒకే రకమైన కూరగాయలు వండి పెడుతున్నట్లు తెలిసింది. జిల్లా అధికారులు స్పందించి బుధేరా మహి ళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించేలాలని చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు కోరుతున్నారు.