జీరో బిల్లు షాక్
కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పడం తప్పా ఆచరణలో విఫలమవుతున్నది. పేద, మధ్య తరగతి ప్రజలకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గొప్పులు చెప్పుకుంటుంది. జీరో విద్యుత్ బిల్లు అనే మాట ప్రజల్లో ఆశలు రేపింది. కానీ 200 యూనిట్ల లిమిట్ ఆ ఆశలను నీరు గార్చింది.
- 200 యూనిట్లు దాటితే బిల్లు మొత్తం కట్టాల్సిందే
- గృహజ్యోతి వినియోగదారులపై విద్యుత్ భారం
- జీరో బిల్లు పథకంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి
- లిమిట్పైన ఎన్నియూనిట్లు ఉంటే దానికే చార్జిచేయాలి
- వేసవి కావడంతో పెరుగుతున్న విద్యుత్ వినియోగం
సిద్దిపేట, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పడం తప్పా ఆచరణలో విఫలమవుతున్నది. పేద, మధ్య తరగతి ప్రజలకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గొప్పులు చెప్పుకుంటుంది. జీరో విద్యుత్ బిల్లు అనే మాట ప్రజల్లో ఆశలు రేపింది. కానీ 200 యూనిట్ల లిమిట్ ఆ ఆశలను నీరు గార్చింది. లిమిట్ దాటితే భారీ బిల్లు ప్రజలకు షాక్ ఇస్తోంది. ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి చివరికి బిల్లు భారంగా మోపడం ఎందుకు..? అని ప్రభుత్వంపై ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో జీరో విద్యుత్ బిల్లుపై ఆశలు పెట్టుకున్న ప్రజలకు విద్యుత్ షాక్ తగిలిందని చెప్పాలి.
200 యూనిట్ల వరకు మాత్రమే ఉచిత విద్యుత్ వర్తిస్తుండగా, ఆ తర్వాత పరిమితి దాటితే పూర్తి బిల్లు చెల్లించాల్సి వస్తోందని ప్రజలు అసంతృపిన్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి తీవ్రత పెరగడంతో ఫ్యాన్లు, కూలర్లు, కొన్ని చోట్ల ఎయిర్ కండిషనర్లు ఎకువగా వాడుతున్నారు. ఈ కారణంగా మెజార్టీ కుటుంబాల విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటుతోంది. దీంతో మొత్తం బిల్లు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా అయితే ఎలా… ? అని ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వేసవి కావడంతో తమ అవసరాల మేరకే విద్యుత్ వాడుతున్నాం కానీ 200 యూనిట్లు దాటితే ఒకసారిగా భారీ బిల్లు వస్తోంది. ఇది మాకు భారంగా మారుతున్నదని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీరో బిల్లు పథకంపై పెరుగుతున్న అసంతృప్తి
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజలు ఆశించిన జీరో విద్యుత్ బిల్లు ఇప్పుడు ఒక విధంగా అర్ధసత్యంగా మారిందన్న భావన పెరుగుతోంది. 200 యూనిట్ల వరకు ఉచితం అన్న హామీ, ఆ పరిమితి దాటిన వెంటనే పూర్తిస్థాయి బిల్లు విధానంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన విధానం ప్రకారం 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం ఉంటే బిల్లు రద్దవుతుంది. కానీ 201 యూనిట్లు అయితే మొత్తం వినియోగంపై సాధారణ టారిఫ్ వర్తిస్తుంది. అంటే కేవలం ఒక యూనిట్ అదనంగా వాడినా బిల్లు మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఇది ఎంత వరకు కరెక్ట్ అని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
తాము 210 యూనిట్లు వాడితే, 10 యూనిట్లకే డబ్బు తీసుకోవాలి కానీ వాడిన మొత్తానికి బిల్లు ఎలా వసూలు చేస్తారని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో రెండు ఫ్యాన్లు, ఒక ఫ్రిజ్, టీవీ మాత్రమే ఉన్నాయి. వేసవిలో కూలర్ వాడితే 200 యూనిట్లు దాటిపోతున్నది. వెంటనే 1,500-2,000 బిల్లు వస్తోంది. ఇది మాకు భారంగా మారిందని మధ్య తరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చాలా కుటుంబాల పరిస్థితి ఇదేవిధంగా ఉంది. వేసవి కావడంతో విద్యుత్ వినియోగం పెరిగిన మాట వాస్తవమే కానీ మొతానికి బిల్లు వసూలు చేయడం కరెక్ట్ కాదని ఉమ్మడి జిల్లా ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం తీవ్ర ఎండలతో విద్యుత్ వినియోగం సహజంగానే పెరుగుతోంది.
ముఖ్యంగా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో ఫ్యాన్లు 24 గంటలు తిరుగుతున్నాయి. కూలర్లు, ఫ్రిజ్‌లు ఎకువగా వాడుతున్నారు.కొన్ని కుటుంబాలు ఎయిర్ కండిషనర్లు కూడా ఉపయోగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 200 యూనిట్ల పరిమితి చాలా తకువగా ఉంది. పేదలకు కొన్ని ఇతర సబ్సిడీలు, పథకాలు ఉన్నా మధ్యతరగతి కుటుంబాలు మాత్రం ఈ లిమిట్ వల్ల ఎకువగా నష్టపోతున్నాయి. 200 యూనిట్ల వరకు ఉచితం దాని పై యూనిట్లకు మాత్రమే చార్జి చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న 200 యూనిట్ల కట్-ఆఫ్ సిస్టమ్ వల్ల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. 200 యూనిట్లపై మాత్రమే చార్జి వేయాలి, లిమిట్‌ను కనీసం 300 యూనిట్లకు పెంచాలని, వేసవిలో ప్రత్యే క సడలింపు ఇవ్వాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పెరుగుతున్న విద్యుత్ వినియోగం
ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ వినియోగం రోజు రోజుకూ పెరుగుతున్నది. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా జిల్లాలో విద్యుత్ సరఫరా కావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయి. ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ సరఫరా బంద్ అవుతున్నది. మరో వైపు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 9 గంటలు అయిందంటే చాలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. కరెంట్ కోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గృహ విద్యుత్ కనెక్షన్లు మొత్తం 12,49, 172 ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో గృహ విద్యుత్ కనెక్షన్లు 3,73,346, మెదక్ జిల్లాలో 2,40, 174, సంగారెడ్డి జిల్లాలో 6,30, 652 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గత ఏడాదికి ఇప్పటికీ పోల్చుకుంటే విద్యుత్ వినియోగం బాగా పెరిగింది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

