మద్దూరు(ధూళిమిట్ట), జనవరి 4: మద్దూరులోని మోడల్ స్కూల్ బాలికల హాస్టల్లో నెలరోజులగా విద్యార్థినులకు కోడిగుడ్లు అందకపోవడంతో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘గుడ్డు గుటకాయస్వాహా’ అనే శీర్షికతో బుధవారం కథనాన్ని ప్రచురించడంతో గురువారం కాంట్రాక్టర్ హాస్టల్‌కు గుడ్లు పంపించారు. రెండువారాలకు సరిపోయేలా సుమారు 300 కోడిగుడ్లు పంపించగా, విద్యార్థులకు భోజనంతోపాటు ఉడకబెట్టిన గుడ్లను అందజేశారు. నెలరోజులుగా గుడ్లు పంపించలేదని, తమకు గుడ్లు అందేలా కృషి చేసిన ‘నమస్తే తెలంగాణ’కు ధన్యవాదాలు తెలిపారు.
మద్దూరు బాలికల హాస్టల్లో విద్యార్థులకు గుడ్లు, చికెన్, మటన్ అందించని కాం ట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ గురువారం సిద్దిపేట కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ ఏడీ వెంకటేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ నెలరోజులుగా హాస్టల్లో మెనూ పాటించకుండా 49మంది విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని మండిపడ్డారు. అధికారులు తక్షణమే స్పందించి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రెడ్డమైన అరవింద్, నాయకులు నవీన్, పవన్ పాల్గొన్నారు.