జిన్నారం, జూలై 30: మండలంలోని శివనగర్-కంజర్ల రోడ్డుపై భారీ గుంతలు తేలి రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుండడంతో ఈనెల 22న ‘గుంతలు తేలిన శివనగర్-కంజర్ల రోడ్డు’ శీర్షికన నమస్తే తెలంగాణలో కథనం ప్రచురితమైంది. ప్రయాణికుల నరకయాతన, వాహనదారుల ఇబ్బందులపై అధికారులు స్పందించారు.
వారి ఆదేశాల మేరకు ఆర్అండ్బీ అధికారులు మంగళవారం గుంతలు పడిన రోడ్డుకు మరమత్తులు చేయించారు. వెట్మిక్స్తో గుంతలను పూడ్చి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేశారు. శివనగర్-కంజర్ల రోడ్డు బాగు చేయడంపై ‘నమస్తే తెలంగాణ’కు, ఆర్అండ్బీ అధికారులకు ప్రయాణికులు ధన్యవాదాలు తెలిపారు.