చిన్నకోడూరు, జనవరి 24: రంగనాయక సాగర్ లెఫ్ట్ కెనాల్‌కు నీటిని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డితో కలిసి మంగళవారం విడుదల చేశారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ చిన్నకోడూరు మండలాధ్యక్షుడు కాముని శ్రీ నివాస్ ఆధ్వర్యంలో మంత్రిని గజమాలతో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో రై తు బంధు జిల్లా డైరెక్టర్ వెంకటేశం, ఏఎంసీ చైర్మన్ వనితారవీందర్రెడ్డి, సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందంగౌడ్, వైస్ ఎంపీపీ పా పయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఉమేశ్ చంద్ర, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచులు లింగం, ఎంపీటీసీ సాయ న్న, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలున్నారు.