గుమ్మడిదల, జూన్ 27: ప్యారానగర్ డం పింగ్ యార్డును వెంటనే రద్దు చేసి ఇక్కడి గ్రామాల రైతులు, ప్రజలను రక్షించాలని రైతు జేఏ సీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మ డిదల మండలంలోని నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ డంపింగ్‌యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా చేస్తున్న రిలే నిరాహారదీక్ష శుక్రవారం 143వ రోజు కు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ డంపింగ్ యార్డు వల్ల ఇక్కడి గ్రామాల రైతులు, ప్రజలకే కాకుండా భూగర్భ జలాలు కలుషితమవుతాయని, వ్యవసాయానికి యోగ్యం కా కుండా ఇక్కడి భూములు మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్‌యార్డులో వేసే చెత్తాచెదారం వల్ల దుర్వాసనతో పాటు దోమలు, ఈగలు వృద్ధి చెంది రకరకాల రోగాలు వస్తాయని, ఇది తెలిసి కూడా ప్రభు త్వం డంపింగ్‌యార్డు ఏర్పాటుకు సిద్ధం కావడం సరైంది కాదన్నారు. డంపింగ్‌యార్డు వల్ల దుష్ర్పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలో రైతు జేఏసీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.