గజ్వేల్, ఆగస్టు 7:గ్రామీణ రహదారులు గుంతలమయంగా మారడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామీ ణ రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరుకాగా అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది.
దీంతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు అభివృద్ధికి నోచుకోవడం లేదు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల మీదుగా వెళ్లే రోడ్ల మరమ్మతులకు అప్పటి సీఎం కేసీఆర్, హరీశ్‌రావు సహకారంతో నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం నిధుల రద్దుతో వర్షాకాలంలో రోడ్ల పరిస్థితి ఆధ్వానంగా కనిపిస్తున్నది.
గజ్వేల్ నియోజకవర్గంలో…
గజ్వేల్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెం దిన పీడబ్ల్యూడీ రోడ్లకు సంబంధించి రూ.65.80 కోట్ల నిధులను గతేడాది అక్టోబర్‌లో కేసీఆర్ ప్రభుత్వం మం జూరు చేసింది. డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ ప్రభుత్వం ఆ నిధులను రద్దు చేసింది. దీంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. రోడ్ల మరమ్మతు పనులు ప్రారంభమవుతాయనుకుంటే ఆనిధులను ప్రభుత్వం రద్దు చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి పనులకు నిధు లు మంజూరు చేయాల్సిన ప్రభుత్వం రద్దు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. గజ్వేల్ మండలం అహ్మదీపూర్ నుంచి కొల్గూర్ వరకు రూ.9.80కోట్లు, వర్గల్ మండలం మీనాజ్పేట నుంచి బస్వాపూర్ వరకు రూ.3 కోట్లు, గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని మూట్రాజ్‌పల్లి మీదుగా రాజీవ్ రహదారి వరకు రూ.30 కోట్లు, మ ర్కూక్ మండలకేంద్రం నుంచి నారాయణపూర్ వరకు రూ.23కోట్ల నిధులు రద్దు కావడంపై ప్రజ లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వీటితో పాటు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో ఎన్నికలకు ముందే కుల సంఘ భవనాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు శంకుస్థాపన చేయగా వాటికి సంబంధించిన నిధులను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. గజ్వేల్ నియోజకవర్గానికి సం బంధించి కోట్లాది రూపాయల అభివృద్ధి పనుల నిధులు రద్దు చేసి ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకుంటుందని ప్రజ లు వాపోతున్నారు.
ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీఆ ర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభమైన పనులకు సంబంధించిన బిల్లులు నేటికీ ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు. అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అసంపూర్తి పనులను పూర్తిచేయించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పరి స్థితులు అధ్వానంగా మారే అవకాశం ఉంది.
మంజూరైన నిధులతో పనులు చేపట్టాలి
కొల్గూర్ నుంచి అహ్మదీపూర్ వరకు రోడ్డు నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభు త్వం మంజూరు చేసిన నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టాలి. గుంతలమయంగా ఉన్న రోడ్డుతో రాత్రి సమయంలో వాహనదారులు ఇబ్బంది పడుతున్నా రు. వర్షాకాలంలో గుంతల్లో నీళ్లు చేరడంతో వాహనదారులు పడిపోయిన సంఘటనలు ఉన్నాయి.
– చక్రపాణి, అహ్మదీపూర్, గజ్వేల్ మండలం, సిద్దిపేట జిల్లా
ప్రభుత్వాలు మారినా అభివృద్ధి ఆగొద్దు
ప్రభుత్వాలు మారితే ప్రజలకు ఉపయోగకరంగా ఉండే అభివృద్ధి పనులను ఆపొద్దు. అభివృద్ధిని ఆపితే ప్ర జలకే నష్టం జరుగుతది. రోడ్డు నిర్మాణానికి మంజూరైన నిధులతో కాం గ్రెస్ ప్రభుత్వం వెంటనే పనులు చేపట్టాలి. ప్రభుత్వా లు మారడం సహజం, కానీ దాని ప్రభావం అభివృద్ధి పనులు, ప్రజలపై పడొద్దు.
– బీపీ రాజు, అహ్మదీపూర్, గజ్వేల్ మండలం, సిద్దిపేట జిల్లా