నర్సాపూర్ : రేషన్ డీలర్లకు పెండింగ్‌లో ఉన్న కమీషన్‌ను వెంటనే విడుదల చేయాలని సోమవారం తహసిల్దార్ శ్రీనివాస్‌కు మెదక్ జిల్లా నర్సాపూర్ మండల రేషన్ డీలర్లు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. రేషన్ డీలర్లకు 5 నెలల నుండి కమీషన్ రావడంలేదని దీంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కమీషన్ డబ్బులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుధాకర్, ప్రధాన కార్యదర్శి రవి గౌడ్ నాయకులు జైపాల్, ఫయీం, నర్సింలు, గోవర్ధన్ రెడ్డి, సర్దార్, రాజు, శంకరయ్య, శ్రీశైలం, కుమ్మరి అశోక్, రమేష్ గుప్తా ఇతర ఇతరులు పాల్గొన్నారు.