రామాయంపేట : రంజాన్ పండుగ సంబురాలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం రామాయంపేట పట్టణంతోపాటు మండలంలోని అక్కన్నపేట, కాట్రియాల, లక్ష్మాపూర్, డి దర్మారం, వెంకటాపూర్ తదితర గ్రామాలలో కులమతాలకు అతీతంగా హిందూ ముస్లింలు అలయ్ బలయ్ తీసుకున్నారు. రామాయంపేట పట్టణంలోని ఈద్గా వద్దకు ముస్లింలు పెద్ద సంఖ్యలో ఖవాలీని వీక్షించారు.
ఖవాలీ అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. రామాయంపేటలో పోలీస్ కానిస్టేబుల్లతో ముస్లిం సోదరులు అలయ్ బలయ్ తీసుకున్నారు. రామాయంపేట పట్టణంతో బాటు అన్ని గ్రామాలలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిపారు. రంజాన్ నేపథ్యంలో రామాయంపేట పట్టణంతోపాటు మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు గట్టి నిఘా కొనసాగించారు. ఎస్ఐ బాలరాజు ఈద్ఘా వద్ద ప్రార్థన అయ్యేంత వరకు అక్కడే ఉండి సిబ్బందితో కలిసి భద్రత కల్పించారు.