సంగారెడ్డి పట్టణంలోని రాజీవ్ స్వగృహ సముదాయాల పరిసరాల్లో అపరిశుభ్రత తాండవిస్తున్నది. భారీగా చెత్తాచెదారం పేరుకుపోయింది. మురుగు నిలిచి పరిసరాలు కంపుకొడుతున్నాయి. పందులు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమలు విజృంభిస్తున్నాయి.
రాజీవ్ స్వగృహ ఇండ్లలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పరిసరాలను శుభ్రం చేయాలని కోరుతున్నారు.
– సంగారెడ్డి ఫొటోగ్రాఫర్, జూలై 28